Karthik Rathnam: నటుడు కార్తీక్‌ రత్నం నిశ్చితార్థం..

‘నారప్ప’ సినిమాతో నటుడిగా మాంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ రత్నం త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. నగరానికి చెందిన ఓ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు....

Published : 06 Mar 2022 10:34 IST

హైదరాబాద్‌: ‘నారప్ప’ సినిమాతో నటుడిగా మాంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ రత్నం త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు వీరి నిశ్చితార్థం శనివారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు నటుడు నవీన్‌ చంద్ర హాజరయ్యాడు. వధూవరులకు అభినందనలు తెలిపాడు.

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించిన కార్తీక్‌.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కార్తీక్‌కు అనుకున్నంత గుర్తింపు లభించలేదు. అనంతరం హీరోగా చేసిన ‘అర్ధ శతాబ్దం’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవల విడుదలైన ‘నారప్ప’లో వెంకటేశ్‌ పెద్దకుమారుడి పాత్రలో కార్తీక్‌ నటించి మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని