Krishna: సాహసాలకృష్ణ ప్రత్యేకం.. ‘వెండితెర వేల్పులు’లో!

అతడిది తేనెమనసు. సినీ వినీలంలో అసాధ్యుడు. అనితరసాధ్యుడు. ఆత్మవిశ్వాసమే ‘వజ్రాయుధం’గా ముందుకు సాగాడు.

Updated : 08 Jan 2022 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయనది తేనె మనసు. సినీ వినీలాకాశంలో అసాధ్యుడు.. అనితరసాధ్యుడు. ఆత్మవిశ్వాసమే ‘వజ్రాయుధం’గా ముందుకు సాగారు. ఆయన మంచివాళ్లకు మంచివాడు.. ఊరికి మొనగాడు. అన్యాయాలు, అక్రమాలపై జ్వలించిన ఆ అగ్నిపర్వతం.. నిరుపేదల గళం. పాడిపంటలతో పుణ్యభూమి బంగారు భూమి కావాలని తపించిన కర్షకుడు.. అభిమాన లోకానికి ఆకర్షకుడు. సావాసానికైనా, సాహసానికైనా మొనగాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలతో దమ్ముచూపి.. బాక్సాఫీసులో దుమ్మురేపిన కథానాయకుడు. దశాబ్దాల క్రితమే ‘సూపర్ స్టార్ డమ్’ సాధించిన అగ్రహీరో. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ.

కృష్ణ గురించి, సినిమాల విషయంలో ఆయన చేసిన సాహసాల గురించి ప్రేక్షకులకి చాటిచెప్పేందుకు ‘వెండి తెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. సినీ నటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పే షో ఇది. ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’, ‘ఈటీవీ తెలంగాణ’లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు, సాయంత్రం 06:30 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎందరో దిగ్గజ నటుల గురించి విశేషాల్ని పంచుకున్న ఈ షో ఈ వారం (జవవరి 9) కృష్ణ సాహసాల్ని గుర్తుచేయబోతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని