Mahesh Babu: వివాహ వార్షికోత్సవం.. చిరంజీవికి మహేశ్‌బాబు థ్యాంక్స్‌!

తన పెళ్లిరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసినందుకు మహేశ్‌బాబు.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 10 Feb 2022 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన పెళ్లిరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసినందుకు చిరంజీవికి మహేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ తదితరులు వెళ్లిన సంగతి తెలిసిందే. నేడు మహేశ్‌బాబు పెళ్లిరోజు సందర్భంగా విమాన ప్రయాణంలోనే చిరంజీవి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంబంధిత ఫొటోని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ మహేశ్ దంపతులు ప్రేమానురాగాలతో, నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు. సీఎంతో భేటీ ముగిసిన అనంతరం చిరంజీవి ట్వీట్‌ను మహేశ్‌ రీట్వీట్‌ చేస్తూ ‘నాకెంతో ఇష్టమైన రోజు ఇది. దాన్ని ఎంతో ప్రత్యేకం చేసినందుకు థ్యాంక్స్‌ చిరంజీవి సర్‌!’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు, మహేశ్‌, నమ్రతా ఒకరికొకరు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ‘వంశీ’ సినిమాలో కలిసి నటించిన మహేశ్, నమ్రతా ప్రేమికులుగా మారారు. 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.




Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని