Naga Shaurya: కల్యాణ వైభోగమే..

తన సినిమా కోసం ‘కల్యాణ వైభోగమే’ అంటూ చాలా రోజుల కిందటే పాడుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య... వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆదివారమే అనూష శెట్టితో కలిసి ఏడడుగులు వేశారు.

Updated : 21 Nov 2022 06:56 IST

న సినిమా కోసం ‘కల్యాణ వైభోగమే’ అంటూ చాలా రోజుల కిందటే పాడుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య (Naga Shaurya)... వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆదివారమే అనూష శెట్టితో కలిసి ఏడడుగులు వేశారు. ఈ జంట వివాహానికి బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ వేదికైంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన సంబరాలు శనివారం నుంచే మొదలయ్యాయి. ముందస్తు పెళ్లి సంబరాల్లో భాగంగా మెహందీ వేడుకని నిర్వహించారు. ముహూర్తం మేరకు ఆదివారం ఉదయం 11.25 గంటలకి నాగశౌర్య, అనూష జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అనూష శెట్టి బెంగళూరుకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌. పెళ్లి తర్వాత బంతి భోజనంతో విందుని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని