Nagababu: సినీ పెద్దలు పవన్‌కు మద్దతివ్వకపోవడం దురదృష్టకరం: నాగబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నటుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమతో పాటు తన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ప్రభుత్వం

Published : 27 Feb 2022 01:48 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నటుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమతో పాటు తన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వకీల్‌సాబ్‌ చిత్రం నుంచి భీమ్లానాయక్‌ వరకు ఆంక్షలు విధిస్తూ పవన్‌పై కక్ష కట్టిందన్నారు. సినిమా టికెట్‌ ధరలపై ఏపీ సర్కార్‌ ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. పవన్‌పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని వ్యాఖ్యానించారు. సినిమా పెద్దలు పవన్‌కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్‌ అర్థం చేసుకుంటున్నారని నాగబాబు అన్నారు.

‘‘ఇది తప్పు అని చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. అగ్ర హీరోలకే ఇలా జరుగుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా సహకరిస్తాం. హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రజలు శాశ్వత అధికారం ఇవ్వలేదు. ప్రభుత్వం ఉండేది ఐదేళ్లే అనే విషయాన్ని వైకాపా గుర్తుంచుకోవాలి’’ అని నాగబాబు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని