Nagarjuna: పూర్తిగా అబద్ధం

నాగచైతన్య, సమంతల గురించి తాను మాట్లాడినట్టు వచ్చిన వదంతులను ఖండించారు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియాలోనూ జరిగిన చర్చ

Updated : 28 Jan 2022 07:07 IST

నాగచైతన్య, సమంతల గురించి తాను మాట్లాడినట్టు వచ్చిన వదంతులను ఖండించారు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియాలోనూ జరిగిన చర్చ పూర్తిగా అర్థం లేనిదని, అందులో ఎలాంటి నిజం లేదని ఆయన ట్విటర్‌ ద్వారా వ్యాఖ్యానించారు. పెళ్లితో ఒక్కటైన నాగచైతన్య, సమంత ఇటీవలే విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై నాగార్జున స్పందించినట్టుగా గురువారం ప్రచారం సాగింది. నాగార్జున వెంటనే కలగజేసుకుని ఇవి ఒట్టి వదంతులు మాత్రమే అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇలాంటి పుకార్లని వార్తలుగా రాయడం మానుకోవాలని మీడియాని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని