Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత

సినీ నటి నమిత (Namitha) పండంటి కవలల (twins)కు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా......

Published : 20 Aug 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సినీ నటి నమిత (Namitha) పండంటి కవలల (twins)కు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. చెన్నై(Chennai) సమీపంలోని  ఓ ఆస్పత్రిలో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు. తామంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపైనా అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని కోరారు. తాను ప్రసవించిన ఆసుపత్రి యాజమాన్యానికి, గర్భం దాల్చినప్పట్నుంచి వైద్యపరమైన సలహాలు, సూచనలు అందించిన వైద్యులందరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కవలలను ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. సొంతం, జెమిని, సింహా తదితర తెలుగు చిత్రాలతో పాటు అనేక తమిళ చిత్రాల్లో నటించిన నమిత.. తన అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని