NBK: నిర్మాతగా బాలకృష్ణ.. ప్రాజెక్టు వివరాలు ఆరోజే

ఇప్పటికే ఎందరో నటులు, దర్శకులు నిర్మాతలుగా మారి, విజయం అందుకున్నారు. ఇప్పుడు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సైతం ప్రొడ్యూసర్‌గా మారారు.

Published : 27 May 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే ఎందరో నటులు, దర్శకులు నిర్మాతలుగా మారి, విజయం అందుకున్నారు. ఇప్పుడు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ( Nandamuri BalaKrishna) సైతం ప్రొడ్యూసర్‌గా మారారు. ఇందుకు బసవ తారకరామ క్రియేషన్స్‌ (basava tarakarama creations) అనే బ్యానర్‌ను ప్రారంభించారు. ఆయన నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు వివరాలను ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం పంచుకోబోతున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బాలకృష్ణ.. నిర్మాతగా ఎలాంటి కథను అందిస్తారోననే ఆసక్తి అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అఖండ’తో గతేడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. తర్వాత, దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని