Naresh- Pavitra: పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు? పవిత్రతో పెళ్లివీడియోపై నరేశ్ స్పందన!
Naresh- Pavitra: ఉదయం నుంచి సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నపెళ్లివీడియోపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని విషయాలు పంచుకుంటానని తెలిపారు.
హైదరాబాద్: సీనియర్ నటుడు నరేశ్ (Naresh).. తన స్నేహితురాలు పవిత్రా లోకేశ్ (pavitra lokesh)ను వివాహం చేసుకుంటున్న వీడియో ఉదయం నుంచి సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. నరేశ్ స్వయంగా ట్విటర్ వేదికగా ఈ వీడియోను పంచుకుంటూ ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రానరేశ్’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది.
ఈ క్రమంలో తాజా పెళ్లి వీడియోపై నరేశ్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam) ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ‘మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అని ఒక విలేకరి ప్రశ్నించగా, నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయి. నేను మీడియాకు ఫ్రెండ్లీ వ్యక్తిని. త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి దాకా ఓపిక పట్టండి. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం’ ప్రమోషన్ పక్కదోవ పడుతుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో దర్శకుడు మారుతి, నిర్మాత వంశీ ముందుంటారు. ఇది పెద్ద సినిమా అవుతుంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రతి ఇల్లు, కుటుంబ సభ్యలందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే నాకు బాగా నచ్చింది. తెలంగాణ యాసలో తొలిసారి మాట్లాడా. నేను బాగా ఎంజాయ్ చేసి నటించిన అతి తక్కువ చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని పంచుతుంది ’’అని నరేశ్ అన్నారు.
‘సమ్మోహనం’ చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ (Naresh) - పవిత్ర (Pavitra) ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సందడి చేశారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియో ఆయా వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అందులో ఆయన పవిత్రను ముద్దాడుతూ కనిపించారు. ఇక ‘ఇంటింటి రామాయాణం’ చిత్రం విషయానికొస్తే, దర్శకుడు మారుతీ సమర్పణలో సురేశ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది.రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో నవ్య స్వామి, గంగవ్వ, నరేష్, సురభి తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేయనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Mrunal Thakur: నటిని అవుతానంటే ఇంట్లోవాళ్లు సపోర్ట్ చేయలేదు: మృణాల్ ఠాకూర్
-
Crime News
Delhi: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
-
General News
Bhadrachalam: వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం
-
World News
Inventions : ఇవి కనిపెడితే మానవాళికి మేలు!
-
Sports News
IPL 2023: గుజరాత్‌తో తొలి మ్యాచ్.. ధోనీ అందుబాటులో ఉంటాడా..? లేదా..?
-
Politics News
YS Sharmila: టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్