Nikhil: రిచా చద్దా ట్వీట్‌పై నిఖిల్ ఆగ్రహం.. ఆమెకు బుద్ధి లేదంటూ నెటిజన్ల ఫైర్..
బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలపై తాజాగా నటుడు నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్: ‘Galwan says hi’ అంటూ బాలీవుడ్ నటి రిచా చద్దా (Richa Chadha) చేసిన ట్వీట్‌పై నటుడు నిఖిల్ (Nikhil) ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుక్షణం దేశాన్ని రక్షిస్తోన్న సైనిక దళాలను అవమానించడం తగదని అన్నాడు. ‘‘మనల్ని, మన దేశాన్ని రక్షించడం కోసం గల్వాన్ దాడుల్లో 20మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ సైనికుల త్యాగాల గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలు మర్చిపోండి. మన దేశ ఆర్మీని ఎప్పుడూ గౌరవించాలి. అమానించకూడదు. రిచా దయచేసి గౌరవించండి. దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి’’ అని నిఖిల్ ట్వీట్ చేశాడు. ‘గల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ రిచా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌ని తప్పుబడుతూ మంచు విష్ణు, అక్షయ్‌కుమార్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెపై మండిపడుతున్నారు. నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు బుద్ధి లేదంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి (పాక్‌ను ఉద్దేశించి) గట్టి సమాధానం ఇస్తాం’ అని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ ‘గల్వాన్ హాయ్ చెబుతోంది’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆమె క్షమాణపలు చెప్పింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Sports News
Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్ దేవ్
-
Movies News
Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్.. కీర్తి సురేశ్ ‘వెన్నెల’ ఎఫెక్ట్!