Venky Atluri: వేడుకగా దర్శకుడు వెంకీ అట్లూరి వివాహం
‘తొలిప్రేమ’ (Tholi Prema) చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు వెంకీ అట్లూరి(Venky Atluri). తాజాగా ఆయన వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్: దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పూజాతో ఆయన ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన వీరి వివాహానికి నటుడు నితిన్, ఆయన సతీమణి షాలినీ, నటి కీర్తి సురేశ్, దర్శకుడు వెంకీ కుడుముల హాజరయ్యారు. నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫొటోని నితిన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతోన్న వెంకీ స్వామికి కంగ్రాట్స్. పూజాతో నీ జీవితం మరెంతో అందంగా మారాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
‘జ్ఞాపకం’తో హీరోగా పరిచయమయ్యారు నటుడు వెంకీ. ‘స్నేహగీతం’, ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. 2018లో విడుదలైన ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా మారారు. ‘మిస్టర్. మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ధనుష్‌తో ‘సార్’ తీస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
World News
Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు
-
India News
మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు