Radhe Shyam: ఆ ఒక్క సీన్ రెండేళ్ల కష్టం.. టికెట్ ధరల జీవో వస్తే హ్యాపీ: ప్రభాస్
తాను నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’లోని ఒక్క సీన్ కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండేళ్లు శ్రమించారని ప్రభాస్ తెలిపారు. ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక.
హైదరాబాద్: తాను నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’లోని ఒక్క సీన్ కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండేళ్లు శ్రమించారని ప్రభాస్ తెలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. 70ల కాలంనాటి ఈ ప్రేమకథలో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్, ప్రభాస్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్న అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధాలిచ్చారు. ఈ విశేషాలివీ..
‘‘గోపీకృష్ణ మూవీస్ సంస్థలో సినిమా చేయాలంటే నాకు టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే పెద్దనాన్న (కృష్ణంరాజు) కెరీర్‌ని మార్చిన నిర్మాణ సంస్థ అది. అదే బ్యానర్లో ఆయనతో కలిసి ‘బిల్లా’లో నటించా. హిట్ అయింది. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ కాస్త భయపడ్డా. కొవిడ్ వచ్చినా, మరో సమస్య ఎదురైనా పెద్దనాన్న మాకు సపోర్ట్‌గా నిలిచారు. ఇందులో ఆయన పరమహంస అనే కీలక పాత్ర పోషించారు. ఆయనతో కలిసి నేను రెండు సన్నివేశాల్లో కనిపిస్తా. రవిందర్ గారు ప్రతి చిన్న ఆకృతిని ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకు కావాల్సిన మెలొడీస్ జస్టిన్ ప్రభాకరన్ మాత్రమే ఇవ్వగలడని ఫిక్సయ్యాం. తన సంగీతంతో మంచి ఫీల్ అందించారు. ఈ సినిమాలోని షిప్ ఎపిసోడ్ కోసమే దర్శకుడు సుమారు రెండేళ్లు కష్టపడ్డారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సీన్ కోసం పనిచేశారు. ఈ సన్నివేశం నిడివి 13నిమిషాలు ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్ ఉంది, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. వ్యక్తిగతంగా నేను ఆస్ట్రాలజీని నమ్మను. అందుకే దర్శకుడు కథ చెప్తున్నప్పుడు సగం విన్నాక నో చెప్పేద్దామనుకున్నా. అయితే వినడం మొదలు పెట్టిన తర్వాత ఆసక్తి పెరిగింది. తప్పకుండా నటించాలనిపించింది’’. - ప్రభాస్.
‘‘కథకు తగ్గ సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్‌కు, ప్రేక్షకుల్ని హత్తుకునేలా నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్. ప్రొడక్షన్ డిజైనర్ రవిందర్ నాకు సోదరుడిలాంటివారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ వల్లే ఈ సాధ్యమైంది. పూజాహెగ్డే.. ప్రేరణ అనే పాత్రలో ఒదిగిపోయింది. విక్రమాదిత్యగా ప్రభాస్ అందరికీ గుర్తుండిపోతారు’’. - దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
‘‘సినిమా ఔట్పుట్ అత్యద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలు, ప్రభాస్‌కు ధన్యవాదాలు’’. - సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్.
‘‘ముందుగా ఈ సినిమాను వింటేజ్ సెట్లలో ఇండియాలోనే తెరకెక్కించాలనుకున్నారు రాధాకృష్ణ. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో శారీరకంగా ఎంతో కష్టపడిన ప్రభాస్ తదుపరి సినిమా చిత్రీకరణ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకున్నారు. దాంతో ఈ కథను ఇటలీ నేపథ్యంలోకి మార్చారు దర్శకుడు. వింటేజ్ బ్యాక్‌గ్రౌండ్ (70ల నాటి ఇటలీ కథ) ఆలోచన మాత్రం ప్రభాస్‌దే’’. - ప్రొడక్షన్ డిజైజన్ రవిందర్.
* చాలాకాలం తర్వాత ప్రేమకథలో నటించడం ఎలా అనిపించింది?
ప్రభాస్: వ్యక్తిగతంగా నాకు కిక్కిచ్చింది. ‘బాహుబలి’, ‘మిర్చి’, ‘సాహో’లాంటి యాక్షన్, కమర్షియల్ చిత్రాల తర్వాత చేయడంతో కాస్త రిలాక్స్‌గా అనిపించింది.
* ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టారు?
రవిందర్: ఇప్పటికే ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు అన్ని కోట్లు ఇన్ని కోట్టు రాసేశారు (నవ్వుతూ..). ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా.
రాధాకృష్ణ: సినిమాకు సుమారు రూ.300 కోట్లు ఖర్చయింది. ప్రేక్షకులు తెరపై చూసేటపుడు రూ.1000 కోట్ల అనుభూతి పొందుతారు.
* ఆంధ్రప్రదేశ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లంతా మీ వైపే చేస్తున్నారు. మీ సినిమాతోనే అయినా టికెట్ ధరలు పెరుగుతాయని..
ప్రభాస్: ‘రాధేశ్యామ్’ విడుదలకంటే ముందే టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే సంతోషిస్తా. ముఖ్యమంత్రితో సమావేశంపై నిర్ణయాలు నా నిర్మాతలకే తెలుసు. అయితే ప్రభుత్వం తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. ఏపీలో పంపిణీదారులు, ప్రదర్శనకారులంతా ఈ సినిమావైపే చూస్తున్నారు.
* సినిమా ప్రచార విషయంలో ఎలా ఫీలయ్యారు?
ప్రభాస్: సాధారణంగా సినిమా ప్రచారం కష్టమైంది. అలాంటిది ఈ చిత్రం కోసం పలుమార్లు చేయాల్సి వచ్చింది. ‘హమ్మయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పూర్తయింది మరికొన్ని రోజుల్లో సినిమా విడుదలవుతుంది’ అని అనుకునేలోపు కొవిడ్ విజృంభించింది.
* ఈ సినిమా అంగీకరించడానికి కారణం?
ప్రభాస్: దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. హస్తసాముద్రికా నిపుణుడిగా నటించడం థ్రిల్ అనిపించి ఈ కథను ఒకే చేశా.
* ఈ సినిమాలో యాక్షన్ అంశాలు ఆశించొచ్చా?
ప్రభాస్: ఇంతకుముందు చెప్పినట్టు 13నిమిషాల షిప్ ఎపిసోడ్లో యాక్షన్ మెండుగా ఉంటుంది. ప్రధమార్ధంలో కొన్ని ఛేజింగ్ సీన్లు ఉన్నాయి. అంతెందుకు నా పాత్ర ‘విక్రమాదిత్య’ మాట్లాడే తీరులోనూ మాస్ ఉంది.
* ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ (హిందీలో) ఇచ్చారు? ఆయనతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?
ప్రభాస్: ఆయనతో కలిసి నటించాలనేది కల. ఇన్నాళ్లకు నెరవేరింది. 20 ఏళ్ల కుర్రాడిలా ఎంతో హుషారుగా ఉంటారు.
* మీరు ఓ పూర్తిస్థాయి కామెడీ చిత్రంలో నటిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిజమేనా?
ప్రభాస్: అవును చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు