Prabhas: మరో అరుదైన ఘనత సాధించిన ప్రభాస్‌.. ఆ జాబితాలో నెంబర్‌ 1

బాహుబలి చిత్రంతో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్.. మరో అరుదైన ఘనత సాధించాడు.

Published : 11 Dec 2021 01:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్.. మరో అరుదైన ఘనత సాధించాడు. బ్రిటన్‌కు చెందిన ‘ఈస్టర్న్-ఐ‘ వీక్లీ విడుదల చేసిన 2021 దక్షిణాసియా ప్రముఖుల జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్ జాబితా.. ‘ఈస్టర్న్-ఐ’లో ఇవాళ ప్రచురితం కానుంది. సినిమా, టీవీ, సాహిత్యం, సంగీతం, సోషల్ మీడియా ప్రపంచంలోని అనేకమంది గ్లోబల్ స్టార్‌ల కంటే ప్రభాస్ ముందు వరుసలో నిలిచాడు. 2021లో విశేషంగా అభిమానులను ఆకర్షించిన 50మంది ప్రముఖులతో ‘ఈస్టర్న్-ఐ’ తాజా జాబితాను రూపొందించింది. బ్రిటిష్ పాకిస్థానీ నటుడు రియాజ్ అహ్మద్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ప్రియాంక చోప్రా మూడో స్థానం, ఇండియన్ అమెరికన్ మిండీ కాలింగ్ నాలుగు, సింగర్ శ్రేయా ఘోషల్ ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ విడుదల కానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని