Prithiveeraj: నాకు 57, ఆమెకు 24.. మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నాం: పృథ్వీరాజ్‌

తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై  నటుడు పృథ్వీరాజ్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేని అన్నారు. 

Published : 30 Oct 2022 01:38 IST

హైదరాబాద్‌: ‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రాలతో తెలుగువారిని అలరించిన నటుడు పృథ్వీరాజ్ (Prithiveeraj)‌. వయసులో తనకంటే చాలా చిన్నదైన ఓ అమ్మాయిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అయితే తాను ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

‘‘ఎంతోకాలం నుంచి తెలుగువారు నన్ను ఆదరిస్తున్నారు. రెండో పెళ్లి గురించి వస్తోన్న వార్తలు చూసి  విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. అందరికీ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. నేను రెండో వివాహం చేసుకున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కాకపోతే.. శీతల్‌ అనే అమ్మాయితో నేను రిలేషన్‌లో ఉన్నాను. ఆమె వయసు 24 ఏళ్లు. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో సుమారు ఆరేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంతో నేను బయటకు వచ్చేసి వేరుగా ఉంటున్నా. ఒంటరితనం మనిషిని కుంగుబాటుకు గురి చేస్తుంది. ఆ బాధను నేనూ అనుభవించా. అలాంటి సమయంలోనే శీతల్‌తో పరిచయం అయ్యింది. మా అభిరుచులు కలిశాయి. స్నేహితులమయ్యాం. ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నాం. ఆమె ఎంతో పరిణతి చెందిన వ్యక్తి’’ అని పృథ్వీరాజ్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న శీతల్‌.. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని అన్నారు. తన ఇంట్లో వాళ్లందరికీ పృథ్వీ తెలుసని, పెళ్లికి వాళ్లందరూ అంగీకారం తెలిపారని ఆమె పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని