Raghu Karumanchi: నటుడు అదుర్స్‌ రఘు ఇంట విషాదం

హాస్య నటుడు అదుర్స్‌ రఘు ఇంట విషాదం నెలకొంది....

Updated : 05 Aug 2022 15:47 IST

హైదరాబాద్‌: హాస్య నటుడు అదుర్స్‌ రఘు (Raghu Karumanchi) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. 1947 జూన్‌ 10న జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలందించారు. రిటైర్మెంట్ అనంతరం ఇంటికే పరిమితమయ్యారు. వెంకట్రావ్ మృతి పట్ల ఆయన బంధువులు, స్నేహితులు, పలువురు సినీ నటులు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని