Rajasekhar: ‘డాక్టర్‌ మైకేల్‌ జాక్సన్‌’ అని పిలిచేవారు!

‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజశేఖర్‌. ముఖ్యంగా

Published : 14 Mar 2022 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజశేఖర్‌. ముఖ్యంగా పోలీసు పాత్రల్లో అద్భుతంగా నటించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. త్వరలో ‘శేఖర్‌’చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. జీవితా రాజశేఖర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  కాగా,  అప్పట్లో ‘అంకుశం’ వంటి చిత్రాలతో మాస్‌ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న రాజశేఖర్‌ ‘అల్లరి ప్రియుడు’లో ప్రేమికుడిగా నటించి, తాను ఏ పాత్రలోనైనా ఒదిగిపోతానని నిరూపించారు. రాఘవేంద్రరావు ఈ కథ చెప్పగానే రాజశేఖర్‌తో సహా చాలా మంది ‘ఎందుకు సర్‌ రిస్క్‌’ అన్నారట. అయినా, దర్శకేంద్రుడు పట్టు వదల్లేదు. ఆయనతో సినిమా తీసి హిట్‌ కొట్టారు.

‘అల్లరిప్రియుడు’ మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అందులోని పాటలకు డ్యాన్స్‌ చేయడానికి రాజశేఖర్‌ చాలా ఇబ్బంది పడేవారట. ‘‘ప్రభుదేవా చేసి చూపించిన స్టెప్‌లు వేయలేకపోయేవాడిని. దీంతో నా బాడీకి సరిపోయేలా స్టెప్‌లను ప్రభుదేవా చేసి చూపించేవారు. కొన్ని సార్లు అవికూడా చేయలేకపోయేవాడిని. అయినా, ప్రభుదేవా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. తన సహాయకులకు, సైడ్‌ డ్యాన్సర్లకు ఒక సలహా ఇచ్చారు. ‘ఆయన(రాజశేఖర్‌) ఏది చేస్తే దాన్ని ఫాలో అవ్వండి’ అని చెప్పారట. నన్ను ‘డాక్టర్‌ మైకేల్‌ జాక్సన్‌’ అని సరదాగా పిలిచేవారు’’ అంటూ ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటారు రాజశేఖర్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని