Rajasekhar: చనిపోయే ముందు ‘శేఖర్‌’ను చూడండమ్మా.. ‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్‌’లో రాజశేఖర్‌ సందడి

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్‌’ కార్యక్రమంలో సందడి చేశారు. స్కిట్‌లో భాగంగా కంటెస్టెంట్లు గొడవ పడుతుంటే. ‘మీరే ఏదైనా చేయాలి సర్‌’ అని న్యాయనిర్ణీత అయిన ఇంద్రజ విజ్ఞప్తి చేయగా ‘మీరు కొట్టుకుని చనిపోయేముందు శేఖర్‌ సినిమా చూడండమ్మా’ అంటూ కామెడీ పండించారు.

Published : 23 May 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్‌’ కార్యక్రమంలో సందడి చేశారు. తన సినిమా ప్రచారంలో భాగంగా ఈ షోకి హాజరయ్యారు. స్కిట్‌లో భాగంగా కంటెస్టెంట్లు గొడవ పడుతుంటే.. ‘మీరే ఏదైనా చేయాలి సర్‌’ అని న్యాయనిర్ణీత అయిన ఇంద్రజ విజ్ఞప్తి చేయగా ‘మీరు కొట్టుకుని చనిపోయేముందు శేఖర్‌ సినిమా చూడండమ్మా’ అంటూ ఆయన కామెడీ పండించారు. మరో స్కిట్‌లో.. ‘ఈ రింగ్‌ దేనిమీద పడితే అది నా సొంతమవుతుందా? మరి రాజశేఖర్‌గారి మీద వేస్తే’ అని ఓ కంటెస్టెంట్‌ అడగ్గా ‘జీవిత వస్తారు’ అంటూ పంచ్‌ విసిరారు. ఇలా ప్రతి స్కిట్‌లోనూ రాజశేఖర్‌ ఇన్వాల్వ్‌ అయి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘సత్యభామా సత్యభామా’ పాటకు ఇంద్రజతో కలిసి స్టెప్పులేసి అలరించారు.

రాజశేఖర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఎపిసోడ్‌లో బుల్లెట్‌ భాస్కర్‌- ఫైమా భార్యాభర్తలుగా కనిపించి, గిలిగింతలు పెట్టారు. మరోవైపు, నోటితో ఓ స్కూటీని పైకెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఫైమా. తాగుబోతు పాత్రలో రాకింగ్‌ రాకేశ్‌, తీవ్రవాదిగా నరేశ్‌, దుకాణదారుడిగా రామ్‌ప్రసాద్‌ తదితరులు తమ తమ స్కిట్లతో ఆకట్టుకున్నారు. ఈ హంగామాతోపాటు రష్మి పెళ్లికూతురు గెటప్‌లో ఎవరి స్కిట్‌లో కనిపించింది? తెలియాలంటే ఈ నెల 27 వరకూ వేచి చూడాల్సిందే. ఈ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో శుక్రవారం రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది. రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి, నటి జీవిత తెరకెక్కించిన చిత్రమే ‘శేఖర్’. మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. మలయాళ సినిమా ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపొందింది. ఇందులో రాజశేఖర్‌ తనయ శివానీ ఓ కీలక పాత్ర పోషించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని