Khiladi: ‘ఖిలాడి’ చిత్రంలో నటించేందుకు కారణం అతనే: రవితేజ

రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకానుంది.

Published : 09 Feb 2022 23:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. వేడుకనుద్దేశించి రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం తొలిసారి అర్జున్‌, అనసూయతో కలిసి నటించా. అర్జున్‌ ఎంతో స్ఫూర్తినిచ్చారు. సినిమాటోగ్రాఫర్లు జీకే విష్ణు, సుజిత్‌ వాసుదేవ్‌ అద్భుతమైన ప్రతిభ చూపారు. ఈ చిత్రంలో నేను బాగున్నానని మీకనిపిస్తే ఆ క్రెడిట్‌ జీకే విష్ణుదే. రామ్‌లక్ష్మణ్‌ ఫైట్లు అందరినీ ఆకట్టుకుంటాయి. నేను జాతకాలు, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. 100 శాతం శ్రమనే నమ్ముతా. దేవిశ్రీ ప్రసాద్‌ ప్రతి సినిమాకు మనసు పెట్టి చేస్తాడు. మీనాక్షి, డింపుల్‌ హయాతిలకు నటిగా మంచి భవిష్యత్తు ఉంటుందనుకుంటున్నా. ఈ చిత్రాన్ని నేను ఓకే చేసేందుకు కారణం రచయిత శ్రీకాంత్‌ విస్సా. అతనితో మరికొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా తక్కువమంది కలిశాం. త్వరలో అందరం కలుద్దాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు దర్శకులు త్రినాథరావు నక్కిన, కె. ఎస్‌. రవీంద్ర (బాబీ) తదితరులు పాల్గొన్నారు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని