Updated : 04 Jul 2022 07:32 IST

Satyadev: పగ.. ప్రేమ.. ‘కృష్ణమ్మ’

త్యదేవ్‌ (Satyadev) హీరోగా దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) సమర్పణలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం  వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘కృష్ణమ్మ’ (Krishnamma) అనే టైటిల్‌ ఖరారు చేశారు. సోమవారం  సత్యదేవ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అందులో సత్యదేవ్‌ నదీ ఒడ్డున కత్తి పట్టుకొని సీరియస్‌గా చూస్తూ నిలబడి ఉన్నారు. ‘‘మంచి, చెడుల కలయిక నది నడత. పగ, ప్రేమ కలయిక మనిషి నడక’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జత చేశారు. ‘‘ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా చిత్రమిది. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర బృందం తెలిపింది. దీనికి సంగీతం: కాల భైరవ, మాటలు: సురేష్‌ బాబా, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts