Satyaraj: కరోనా బారిన పడిన కట్టప్ప.. ఆస్పత్రిలో చేరిక

భారతీయ చిత్రపరిశ్రమలో కరోనా (Corona Virus) మూడో వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు చెందిన పలువురు అగ్ర, యువ నటీనటులు దాని బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబ....

Published : 08 Jan 2022 10:30 IST

చెన్నై: సినీ ఇండస్ట్రీలో కరోనా కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికే మహేశ్‌బాబు (Maheshbabu), మంచు లక్ష్మి (Manchu Lakshmi), త్రిష (Trisha), మీనా (Meena), మనోజ్‌ తదితరులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇప్పుడు మరో సెల్రబిటీకి వైరస్‌ సోకింది. ‘బాహుబలి’ చిత్రంలో కట్టప్పగా ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ నటుడు సత్యరాజ్‌కు (SatyaRaj) కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న సినీప్రియులు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఇక, దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఈ నెల 6 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం లాక్‌డౌన్‌ పెడుతున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని