Cinema news: మొదట నేనే గుర్తొచ్చానా..?

వయసు పెరిగే కొద్దీ యువ్వనంగా కనిపించే హీరోల్లో నటుడు సిద్ధార్థ్‌ ముందు వరుసలో ఉంటారు. నాలుగుపదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. అయితే.. తన వయసు గురించి ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలపై సిద్ధార్థ్‌ ఘాటుగా స్పందించారు. హీరోల వయసు అనగానే మొదట నేనే గుర్తొచ్చానా..?

Published : 18 Jul 2021 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు పెరిగే కొద్దీ యువ్వనంగా కనిపించే హీరోల్లో నటుడు సిద్ధార్థ్‌ ముందు వరుసలో ఉంటారు. నాలుగుపదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. అయితే.. తన వయసు గురించి ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలపై సిద్ధార్థ్‌ ఘాటుగా స్పందించారు. హీరోల వయసు అనగానే మొదట నేనే గుర్తొచ్చానా..? అంటూ మండిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  త్వరలో విడుదల కానున్న సినిమాలో వయసులో సగంకంటే తక్కువ వయసున్న హీరోయిన్‌తో నటించాడంటూ ట్విటర్‌లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ స్పందిస్తూ 40 సంవత్సరాల వయసున్న సిద్ధార్థ్‌ 20ఏళ్ల హీరోయిన్‌తో నటించినప్పుడు ఆ హీరో  నటించడంలో తప్పేముంది అని ప్రశ్నించాడు. ఆ ట్వీట్‌లో సిద్ధార్థ్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనిపై స్పందించిన నటుడు సిద్ధార్థ్‌ ‘ఈ హీరో వయసు విషయంలో నీకు మొదట నేనే గుర్తొచ్చానా..? ట్యాగ్‌ కూడా చేశావ్‌.? సూపర్‌ దరిద్రమ్‌. ఎక్కడి నుంచి వస్తారయ్యా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో నేరుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు హిట్‌ సినిమాల్లో నటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళంతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ‘మహాసముద్రం’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో మరో మూడు సినిమాలు చేస్తున్నారు. ‘నవరస’ అనే వెబ్‌సిరీస్‌లోనే కనిపించనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని