Srikanth: విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్‌

తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

Updated : 22 Nov 2022 15:17 IST

హైదరాబాద్‌: తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన ఫేక్‌ న్యూస్‌ చూసి ఊహ ఆందోళనకు గురైంది. ఆ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లపై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన వదంతులు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని