Sudhakar: నటుడు సుధాకర్‌ దంపతులకు బాబు..

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’లో నాగరాజుగా నటించి మెప్పించారు సుధాకర్. ‘కుందనపు బొమ్మ’, ‘క్రాక్‌’, ‘రాజా విక్రమార్క’ వంటి  చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన ఆయన.. తన సతీమణి హారికతో గత కొంతకాలంగా యూఎస్‌లో....

Updated : 21 May 2022 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’లో నాగరాజుగా నటించి మెప్పించారు సుధాకర్. ‘కుందనపు బొమ్మ’, ‘క్రాక్‌’, ‘రాజా విక్రమార్క’ వంటి  చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన ఆయన.. తన సతీమణి హారికతో గత కొంతకాలంగా యూఎస్‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈజంట శుభవార్త చెప్పింది. తమకు మగ బిడ్డ పుట్టాడని తెలియజేసింది. మే 14న హారిక బాబుకు జన్మనిచ్చిందని, రుద్ర అనే పేరు పెట్టామంటూ సుధాకర్‌ సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు సుధాకర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని