Suman: సుమన్‌కు కాంతారావు పురస్కారం

ప్రముఖ నటుడు, దివంగత కాంతారావు శతజయంతి పురస్కారానికి నటుడు సుమన్‌ని ఎంపిక చేశారు. శనివారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

Updated : 20 Nov 2022 09:36 IST

ప్రముఖ నటుడు, దివంగత కాంతారావు శతజయంతి పురస్కారానికి నటుడు సుమన్‌ని (Suman) ఎంపిక చేశారు. శనివారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. డిసెంబరులో రవీంద్రభారతిలో నిర్వహించనున్న సభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘‘జానపద చిత్రాల్లో ఎన్టీఆర్‌కి సమానంగా కాంతారావుకు ఆదరణ ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమకి రామారావు, నాగేశ్వరరావు రెండు కళ్లు అయితే.. కాంతారావు మధ్యలో తిలకం లాంటివారని దాసరి నారాయణరావు చెప్పేవారు. అలాంటి కాంతారావుని స్మరించుకోవడం చాలా అవసరం. ఆయన పేరుతో పురస్కారం మొదలు పెట్టడం, తొలిసారి హీరో సుమన్‌కి ఇవ్వాలని నిర్ణయించడం ఆనందం’’ అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘‘నేను దర్శకత్వం వహించిన ‘సుందరీ సుబ్బారావు’లో కాంతారావు ఓ మంచి పాత్ర పోషించారు. కాంతారావు కత్తి యుద్ధాలంటే నాకెంతో ఇష్టం’’ అన్నారు. ఎవ్వరినీ నొప్పించకుండా చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేసిన మా నాన్న శతజయంతి వేడుకల్ని నిర్వహిస్తుండటం, ఆయన పేరుపై పురస్కారం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు కాంతారావు తనయుడు, రాజా. కార్యక్రమంలో పీసీ ఆదిత్య, డి.అచ్యుత జగదీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని