సుమన్‌కు లెజెండ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం

నటుడు సుమన్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 14 Jul 2021 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు సుమన్‌ను లెజెండ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి విలన్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని