Samantha: ‘యశోద’లో ముకుందన్‌

సమంత ప్రధాన పాత్రలో హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడీ సినిమాలో మలయాళ

Updated : 21 Dec 2021 11:03 IST

సమంత ప్రధాన పాత్రలో హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడీ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ కూడా భాగమయ్యారు. ఆయనిందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదొక విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. మునుపెన్నడూ చేయని ఓ సరికొత్త పాత్రలో సమంత కనిపించనుంది. ఇలాంటి సినిమాలో ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ లాంటి నటులు భాగమైనందుకు సంతోషిస్తున్నామ’’న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని