ఇల్లు అద్దెకు దొరక్క ఇబ్బందిపడుతోన్న బిగ్‌బాస్‌ బ్యూటీ

బిగ్‌బాస్‌ నటి ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed) చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తనకు ముంబయిలో ఇల్లు అద్దెకు దొరకడం లేదని ఆమె అన్నారు.

Published : 25 Jan 2023 16:22 IST

ముంబయి: ముంబయి (Mumbai) మహానగరంలో ఇల్లు అద్దెకు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు బిగ్‌బాస్‌ (హిందీ) నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed)‌. తన వస్త్రాధారణ కారణంగా యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని ఆమె వాపోయారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆమె తాజాగా ట్వీట్స్‌ పెట్టారు. ‘‘నా డ్రెస్సింగ్‌ విషయంలో ఇబ్బంది ఉండటం వల్ల కొంతమంది యజమానులు నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సుముఖంగా లేరు. పలువురు రాజకీయనేతల నుంచి ఇటీవల కాలంలో నాకు బెదిరింపులు వచ్చిన కారణంగా మరికొంతమంది ఇంటిని అద్దెకు ఇవ్వను అంటున్నారు. ముంబయిలో అద్దె ఇంటిని పొందడం చాలా కష్టం’’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘నేనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. మీకు త్వరగా మంచి నివాసం దొరకాలని కోరుకుంటున్నా’’ అని రిప్లై ఇచ్చాడు. ‘‘ప్రతిసారీ ఇదే జరుగుతోంది. పెళ్లి కాని ఓ నటికి ఇల్లు అద్దెకు దొరకడం అసాధ్యమే’’ అంటూ ఆమె బదులిచ్చింది.

హిందీలో ప్రసారమైన పలు ధారావాహికల్లో నటించి ఉర్ఫీ జావేద్‌ ప్రేక్షకుల్ని అలరించారు. సీరియల్స్‌లో నటిస్తోన్న తరుణంలోనే ఆమెకు ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’లో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా, 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే, గత కొంతకాలంగా విభిన్నమైన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో ఆమె వార్తల్లో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని