Venkat: నేను వద్దన్న అమ్మాయినే హీరోయిన్‌గా చేశారు: వెంకట్‌

తన మొదటి చిత్రం ‘సీతారాముల కల్యాణం చూతుమురారండి’ విజయం సాధించినా, చిరంజీవి ‘అన్నయ్య’తోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని నటుడు వెంకట్‌ అన్నారు.

Updated : 01 Mar 2022 13:32 IST

హైదరాబాద్‌: తన మొదటి చిత్రం ‘సీతారాముల కల్యాణం చూతుమురారండి’ విజయం సాధించినా, చిరంజీవి ‘అన్నయ్య’తోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని నటుడు వెంకట్‌(Venkat) అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ‘సీతారాముల కల్యాణం..’ చిత్రీకరణలో భాగంగా దిగ్గజ నటుడు నాగేశ్వరరరావు తన చెంప పగలకొట్టారని గుర్తు చేసుకున్నారు. విజయశాంతి తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని, తమ కుటుంబంతో ఉన్న పరిచయం కారణంగానే గాంధీ టెక్స్‌కు మోడలింగ్‌ చేశారని వెంకట్‌ చెప్పారు. ‘సీతారాముల కల్యాణం...’లో హీరోయిన్‌ను ఎంపిక చేద్దామని వైవీఎస్‌ చౌదరి ముంబయి వెళ్తే, అప్పుడు చాందినిని వద్దని చెప్పానని, అయితే, ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారని వెంకట్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ అయిదుగురు’ చిత్రీకరణ సందర్భంగా ప్రమాదం జరిగి మూడు నెలలు మంచంపైనే ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మార్చి 7న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని