Vijay Antony: నటుడు విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె (16) ఆత్మహత్య చేసుకుంది.

Updated : 19 Sep 2023 17:34 IST

చెన్నై: నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె (16) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె 12వ తరగతి చదువుతోంది.

విజయ్ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని