Yashoda: ‘యశోద’.. ఎవరో తెలుసా!
నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’’ అంటోంది సమంత.
‘‘నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’’ అంటోంది సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ (Yashoda). హరి - హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురువారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సరోగసి (అద్దె గర్భం) నేపథ్యంలో జరిగే ఒక క్రైమ్ చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. డబ్బు అవసరం ఉన్న మహిళల్ని సరోగసి ఆశ చూపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ పెద్ద భవంతిలో ఉంచుతుంది ఒక ముఠా. అక్కడికి సమంత కూడా అద్దె గర్భం మోయడానికి వస్తుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద క్రైమ్ జరుగుతుంటుంది. మరి ఆ క్రైమ్ ఏంటి? దాన్ని యశోద ఎలా పసిగట్టింది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది మిగతా కథ. సమంత నటన, యాక్షన్ ప్రచార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్మని పెంచిన తల్లి’’ అంటూ ట్రైలర్ చివర్లో సామ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు