Published : 18 May 2022 21:52 IST

Vijay: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్‌

హైదరాబాద్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (vijay) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌ శాలువాతో సత్కరించి, ఓ జ్ఞాపికను అందజేశారు. అనంతరం, ఇరువురు కాసేపు ముచ్చటించారు. విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 66’ (Thalapathy 66) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్‌.. సీఎంను కలిశారు. విజయ్‌తోపాటు దర్శకుడు వంశీ కూడా సీఎంను కలిసేందుకు వెళ్లారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది. తమన్‌ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని