Vijay: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (vijay) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌ ఆయన్ను శాలువాతో సత్కరించి, ఓ జ్ఞాపికను అందజేశారు.

Published : 18 May 2022 21:52 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (vijay) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌ శాలువాతో సత్కరించి, ఓ జ్ఞాపికను అందజేశారు. అనంతరం, ఇరువురు కాసేపు ముచ్చటించారు. విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 66’ (Thalapathy 66) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్‌.. సీఎంను కలిశారు. విజయ్‌తోపాటు దర్శకుడు వంశీ కూడా సీఎంను కలిసేందుకు వెళ్లారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది. తమన్‌ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని