Vijaykanth: కెప్టెన్‌ విజయ్‌కాంత్‌కు అస్వస్థత

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున

Updated : 19 May 2021 09:21 IST

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

గతేడాది విజయ్‌కాంత్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అప్పట్లో ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు