Vishal: షూటింగ్‌లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు

కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు (Vishal) గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ (Mark Antony) చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.....

Published : 11 Aug 2022 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు (Vishal) గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ (Mark Antony) చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

విశాల్‌కు గాయాలు కావడంతో ‘మార్క్‌ ఆంటోనీ’ షూట్‌ నిలిపివేశారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సినిమాల కోసం విశాల్ ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి ముందుంటారు. గతంలోనూ ఆయన పలు సినిమాల షూటింగుల్లో గాయాలపాలయ్యారు. ఇటీవల ‘లాఠీ’ షూట్‌లోనూ ఆయనకు పలుమార్లు గాయాలయ్యాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని