Vishwak Sen: ‘ఈ సినిమా నన్ను తీర్చిదిద్దింది’.. మరోసారి సీక్వెల్‌ ప్రకటించిన విశ్వక్‌సేన్‌

స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. ఈ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 31 May 2023 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das) సినిమా నటుడిగానే కాకుండా తనని మనిషిగాను తీర్చిదిద్దిందని యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) తెలిపారు. ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ సినిమా తనకు ఎన్నో అవకాశాలు అందించిందని పేర్కొన్నారు. తనపై ప్రేమ కురిపించి.. సపోర్ట్‌గా నిలిచిన తెలుగు ప్రేక్షకులు, మీడియాకి కృతజ్ఞతలు చెప్పారు. ‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2.. వంద రెట్లు స్ట్రాంగ్‌గా ఉంటుందన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 

మలయాళంలో విజయవంతమైన ‘అంగమాలి డైరీస్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’ పేరుతో విశ్వక్‌సేనే రీమేక్‌ చేశారు. దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందారు. 2019 మే 31న విడుదలైన ఈ సినిమాకి పార్ట్‌ 2 తీస్తానని ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ చిత్రంతోపాటు ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) సినిమా సీక్వెల్‌ తీయాలని ఉందని గతంలో తెలిపారు. స్వీయ దర్శక్వత్వంలో నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’తో ఈ ఏడాది ప్రేక్షకుల్ని అలరించిన విశ్వక్‌ త్వరలోనే ‘గామి’ చిత్రంతో సందడి చేయనున్నారు. టైటిల్‌ ఖరారు కాని రెండు సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. మరోవైపు, విశ్వక్‌సేన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన హారర్‌ మూవీ ‘బూ’ (boo) నేరుగా ఓటీటీ (ott) ‘జియో సినిమా’ (jio cinema)లో మే 27న విడుదలై, థ్రిల్‌ పంచుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు