Vishwak Sen: ఆ పదం వాడినందుకు సారీ: విశ్వక్‌సేన్‌

విశ్వక్‌సేన్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌.. ఇలా ఏ యాప్‌ ఓపెన్‌  చేసినా ఆయన గురించే ఎక్కువ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.

Published : 04 May 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌సేన్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌.. ఇలా ఏ యాప్‌ ఓపెన్‌ చేసినా అతడి గురించే ఎక్కువ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. కారణం.. ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌కు హాజరై అసభ్యకరమైన ఓ పదం వాడటం. ఈ విషయంపై ఓ ప్రెస్‌మీట్‌లో విశ్వక్ స్పందించాడు. దెబ్బతగిలితే అమ్మ అని ఎలా అంటామో.. ఆ సమయంలో అదే ఫీలింగ్‌తో అలా అన్నానని, యువకుడిని కావడం వల్ల తప్పు జరిగిందన్నాడు. ఒకే ఒక్క పరుష పదం వాడటం తప్ప తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నాడు. ఆ ఒక్క పదం వాడినందుకు క్షమాపణలు చెప్పాడు.

విశ్వక్‌సేన్‌ నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం మే 6న విడుదలకానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నగర రహదారిపై అతడు ఓ ప్రాంక్‌ వీడియోను చేశాడు. ప్రమోషన్‌ పేరిట న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో టీవీ ఛానల్‌ డిబేట్‌ నిర్వహించి, దానికి విశ్వక్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలో యాంకర్‌, విశ్వక్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని