Vishwak Sen: ఇకపై అలా ప్రయాణం

యువ కథానాయకుడు విష్వక్‌సేన్‌ రెండు కొత్త చిత్రాల్ని ప్రకటించారు. ‘ఫలక్‌నామా దాస్‌ 2’, ‘స్టూడెంట్‌ జిందాబాద్‌’ పేరుతో కొత్త సినిమాలు చేయనున్నట్టు తెలిపారు. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’తోపాటు, ‘గామి’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’,

Updated : 31 Mar 2022 13:57 IST

యువ కథానాయకుడు విష్వక్‌సేన్‌ రెండు కొత్త చిత్రాల్ని ప్రకటించారు. ‘ఫలక్‌నామా దాస్‌ 2’, ‘స్టూడెంట్‌ జిందాబాద్‌’ పేరుతో కొత్త సినిమాలు చేయనున్నట్టు తెలిపారు. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’తోపాటు, ‘గామి’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘లేడీస్‌ నైట్‌’ తదితర చిత్రాలు చేస్తున్నారాయన. ‘ముఖచిత్రం’లోనూ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విష్వక్‌సేన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఓ సినిమాలో ‘ఇప్పటివరకు ఒక ఎత్తు... ఇక నుంచి మరో ఎత్తు’ అనే డైలాగ్‌ చెబుతాను. కథానాయకుడిగా ఇక నుంచి నా ప్రయాణం అదే తరహాలో ఉంటుంది. విభిన్నమైన సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి. అందుకే కథానాయకుడిగానే కాకుండా, నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కరాటే రాజు, బెక్కం వేణుగోపాల్‌, రచయిత ప్రసన్నకుమార్‌, సంగీత దర్శకుడు జీవీ, ‘ఓరి దేవుడా’ చిత్ర దర్శకుడు అశ్వథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు