Vishwak Sen: విష్వక్‌ సేన్‌ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై

ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో విష్వక్‌ సేన్‌ వేదికపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published : 16 Jun 2024 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అదేంటంటే? ‘మెట్రో రెట్రో’ పేరిట అవయవ దానంపై అవగాహన కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగింది. దానికి విష్వక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరణానంతరం తానూ అవయవదానం చేయనున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తన వ్యక్తిగత వివరాలు అందించారు. ‘దాత అనుమతి కార్డు’ పట్టుకుని విష్వక్‌ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, జగపతి బాబు, అమిర్‌ఖాన్‌ తదితరులు అవయవదానం చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్‌ చరణ్‌ ప్రేమ

విష్వక్‌ సేన్‌ సినిమాల విషయానికొస్తే.. ‘గామి’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’తో బిజీగా ఉన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు, రామ్‌ నారాయణ్‌తో ‘లైలా’ సినిమా చేస్తున్నారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) రెండు రోజుల క్రితమే ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని