
Chandrababu: చంద్రబాబు, లోకేశ్త్వరగా కోలుకోవాలి: చిరంజీవి, ఎన్టీఆర్
ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటులు చిరంజీవి, ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు వేర్వేరుగా ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబుగారు, లోకేశ్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
‘‘మామయ్య చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. తనకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చంద్రబాబు ట్విటర్ ఖాతా ద్వారా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. ఆయన ఉండవల్లిలోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు, లోకేశ్‌కు సోమవారమే కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ ఇద్దరూ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు నెటిజన్లూ ఆకాంక్షించారు.