Thalapathy 66: విజయ్‌తో ఒకరిద్దరు కాదు నలుగురు ప్రముఖ నటులు.. వారెవరంటే?

తమిళ హీరోలతో తెలుగు దర్శకులు, టాలీవుడ్‌ హీరోలతో కోలీవుడ్‌ డైరెక్టర్లు ఇటీవల విరివిగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్‌లోనే రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టు ‘దళపతి 66’ (వర్కింగ్‌ టైటిల్‌).

Published : 08 May 2022 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ హీరోలతో తెలుగు దర్శకులు, టాలీవుడ్‌ హీరోలతో కోలీవుడ్‌ డైరెక్టర్లు ఇటీవల విరివిగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టు ‘దళపతి 66’ (వర్కింగ్‌ టైటిల్‌). తమిళ నటుడు విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కథానాయికగా రష్మిక, సంగీత దర్శకుడిగా తమన్‌ను తీసుకోగా కీలక పాత్రధారుల వివరాలను చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. వారిని ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో భాగమైన ఆ ప్రముఖ నటులెవరో కాదు ప్రకాశ్‌రాజ్‌, ప్రభు, శరత్‌కుమార్, జయసుధ. చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజువల్స్‌ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని