నన్ను గర్భవతిని చేసి పెళ్లికి నో అన్నాడు!

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి తనతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు ముఖం చాటేశాడని ఓ నటి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనని తల్లిని....

Updated : 30 May 2021 19:07 IST

మాజీ మంత్రిపై నటి ఫిర్యాదు

చెన్నై: తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి తనతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు ముఖం చాటేశాడని ఓ నటి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనని గర్భవతిని చేశాడని, ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోనంటున్నాడని ఆమె ఆరోపించింది. అసలేం జరిగిదంటే.. కోలీవుడ్‌కు చెందిన ఓ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది.

తాజాగా ఆమె తమిళనాడు రాష్ట్ర మాజీ మంత్రి మణికందన్‌పై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. తనకి గత కొన్ని సంవత్సరాల క్రితం మణికందన్‌తో పరిచయం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమకు దారి తీయడంతో ఐదేళ్లపాటు సహజీవనం చేశామని ఆమె పేర్కొంది. అంతేకాకుండా ఈ క్రమంలో తాను గర్భవతినయ్యానని.. మణికందన్‌ ఒత్తిడి వల్ల అబార్షన్‌ కూడా చేయించుకున్నానని.. తీరా ఇప్పుడు తనని పెళ్లి చేసుకోనంటున్నాడని ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ విషయం గురించి ఎక్కడైనా పెదవి విప్పితే.. ప్రైవేట్‌ ఫొటోలను లీక్‌ చేస్తానంటూ మణికందన్‌ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మణికందన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని