Aditi Gautam: వైభవంగా ‘నేనింతే’ హీరోయిన్ వివాహం
కథానాయిక అదితి గౌతమ్.. మిఖాయిల్ పాల్కివాలా అనే వ్యక్తిని వివాహమాడారు. వేడుక వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నేనింతే’ (Neninthe) సినిమాతో తెరంగేట్రం చేసి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అదితి గౌతమ్ (Aditi Gautam) అలియాస్ శియా గౌతమ్. ఆమె వివాహం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. మిఖాయిల్ పాల్కివాలా అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేశారు. ఆయన ముంబయికి చెందిన వ్యాపార వేత్త అని తెలుస్తోంది. హల్దీ ఫంక్షన్, సంగీత్.. ఇలా సందడిగా సాగిన తమ పెళ్లి సంగతులను శియా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ సడెన్ సర్‌ప్రైజ్ పోస్ట్‌ను చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ వివాహం ఎక్కడ జరిగిందనే విషయాన్ని శియా వెల్లడించలేదు.
2008లో విడుదలైన ‘నేనింతే’లో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2010లో వచ్చిన ‘వేదం’లో కీలక పాత్ర పోషించిన ఈ నటి.. గతేడాది విడుదలైన ‘పక్కా కమర్షియల్’లో ఓ పాత్రలో నటించి అలరించారు. మధ్యలో ఓ హిందీ చిత్రం, ఓ కన్నడ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మరో మహాభారతం’ అనే నాయికా ప్రాధాన్య చిత్రం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka murder case : వివేకా హత్య కేసులో తులసమ్మ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Ap-top-news News
Gudivada Amarnath : మంత్రి గారికి కోపమొచ్చింది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
-
Ts-top-news News
MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
-
Ap-top-news News
Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం
-
Movies News
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’గా రామ్‌చరణ్.. అదరగొట్టేలా టైటిల్ లోగో