RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌పై ఆగ్రహం.. స్పందించిన అలియాభట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందంపై తాను ఆగ్రహంగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆలియా భట్‌ స్పందించింది. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది.

Published : 01 Apr 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందంపై తాను ఆగ్రహంగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై అలియా భట్‌ స్పందించింది. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఆధారంగా ఇలాంటి అసత్య ప్రచారాల్ని సృష్టించవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తక్కువ పోస్ట్‌లు ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు పాత వీడియోలను తొలగిస్తుంటా. అంత మాత్రాన ఏదేదో ఆపాదించుకుంటే ఎలా? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే ప్రపంచంలో భాగస్వామినవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో నేను పోషించిన సీత పాత్రను ఎంతగానో ప్రేమించా. రాజమౌళి సర్‌, తారక్‌, చరణ్‌లతో కలిసి పనిచేయడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రం కోసం వెచ్చించిన ప్రతి క్షణం మధురానుభూతినిచ్చింది. రాజమౌళి సర్‌, ఆయన టీమ్‌ ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. నా విషయంలో ఈ సినిమాపై వస్తున్న అవాస్తవాలను ఖండిస్తున్నా’’ అని అలియా భట్‌ తెలిపింది.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అలియా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమాలో పాత్ర నిడివి తక్కువగా ఉన్న కారణంతోనే చిత్ర బృందంపై ఆమె కోపంగా ఉందని, అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన పోస్ట్‌లన్నింటినీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించిందని, రాజమౌళిని అన్‌ఫాలో అయిందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అలియా సమాధానమిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని