Mega 154: చిరంజీవి- బాబీ కాంబో.. హీరోయిన్‌ ఫిక్స్‌

ప్రముఖ నటుడు చిరంజీవి- దర్శకుడు కె. ఎస్‌. రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో చిరంజీవి సరసన ఎవరు నటిస్తున్నారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Updated : 08 Mar 2022 22:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి- దర్శకుడు కె. ఎస్‌. రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మెగా 154’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో చిరంజీవి సరసన ఎవరు నటిస్తున్నారా? అనే ప్రశ్నకు చిత్ర బృందం సమాధానమిచ్చింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా హీరోయిన్‌ వివరాల్ని తెలియజేసింది. చిరంజీవితో కలిసి సందడి చేయనున్న ఆ నాయిక మరెవరో కాదు శ్రుతిహాసన్‌. ఈ ప్రాజెక్టులోకి ఆమెను ఆహ్వానిస్తూ ట్విటర్‌ వేదికగా చిరంజీవి ఓ ఫొటోని పంచుకున్నారు.

వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని మాస్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని