Anupama Parameswaran: బేబీ బంప్‌తో అనుపమ సర్‌ప్రైజ్‌.. అభిమానుల షాక్‌!

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నాయికల్లో అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. అభిమానులతో తన సినిమా కబుర్లతోపాటు వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటుంటారు.

Published : 01 Feb 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నాయికల్లో అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. అభిమానులతో తన సినిమా కబుర్లతోపాటు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటుంటారు. తాజాగా.. బేబీ బంప్‌ ఫొటోతో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశారు. విషయం ఏంటంటే.. అనుపమ 2019లో ‘మనియరయిలే అశోకన్‌’ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె గర్భవతిగా కనిపిస్తారు. సంబంధిత చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోల్ని భద్రంగా దాచుకున్న అనుపమ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇందులో అనుపమ తండ్రి ఆమెను ఆప్యాయంగా పట్టుకుని కనిపించారు. ఫొటోల్లోని సహజత్వం అనుపమ గర్భవతా? అనే ప్రశ్నకు తావిచ్చింది. ‘అనుపమకి పెళ్లి ఎప్పుడు అయింది?’, ‘ఇది నిజమేనా?’ అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలపై పలువురు సెలబ్రిటీలు సరదాగా స్పందించారు. ‘కంగ్రాట్స్‌ అనుపమ’ అంటూ నవ్వుల ఎమోజీలు జత చేశారు.

‘ప్రేమమ్‌’ అనే మలయాళ సినిమాతో నటిగా మారిన అనుపమ ‘అఆ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘హలో గురు ప్రేమకోసమే’ తదితర చిత్రాలతో అలరించిన ఆమె ఈ సంక్రాంతికి ‘రౌడీబాయ్స్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ‘18 పేజెస్‌’, ‘కార్తికేయ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని