Hansika: ఘనంగా హన్సిక - సోహైల్‌ వివాహం.. ఒక్కటైన ప్రేమజంట

హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు సోహైల్‌తో ఆమె పెళ్లి వేడుకగా జరిగింది. 

Published : 05 Dec 2022 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి హన్సిక (Hansika) వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. జైపుర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘దేశముదురు’తో హన్సిక కథానాయికగా వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో అవకాశాలు వరుస కట్టాయి. ఇటీవల ఆమె నటించిన 50వ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే సోహైల్‌తో తన వివాహం గురించి బయటపెట్టారు. సోహైల్‌కు అంతకు ముందే వివాహమైంది. గతంలో హన్సిక స్నేహితురాలతో ఆయనకు పెళ్లి కాగా.. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు