Haripriya: కేజీయఫ్‌ నటుడితో హీరోయిన్‌ నిశ్చితార్థం

‘కేజీయఫ్‌’ ఫేమ్‌ వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల ఈ జంటకు నిశ్చితార్థం అయ్యింది.

Published : 10 Dec 2022 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పిల్ల జమీందార్‌’తో (Pilla Zamindar) హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి హరిప్రియ (Haripriya) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియుడు, ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ వశిష్ఠ సింహాతో (Vasishta N.Simha) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.  ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో నివాసంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వశిష్ఠ ఇన్‌స్టా వేదికగా తాజాగా షేర్‌ చేశారు. ‘‘మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి’’ అని పోస్ట్‌ పెట్టారు. వీటిని చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కర్ణాటకు చెందిన హరిప్రియ ‘తకిట తకిట’తో టాలీవుడ్‌కు పరిచయమ్యారు. అనంతరం ‘పిల్ల జమీందార్‌’తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘గలాట’, ‘జై సింహా’ చిత్రాల్లో నటించారు. మరోవైపు, ‘కేజీయఫ్‌’లో కమల్‌ పాత్ర పోషించి వశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని