Actress Hema: సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు

యూట్యూబ్‌ ఛానెళ్లపై సినీనటి హేమ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న ఫొటోలకు ఫేక్‌ థంబ్‌నైల్స్‌ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated : 21 Mar 2023 19:49 IST

హైదరాబాద్‌: సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య ప్రచారం చేయడంపై సినీనటి హేమ (Hema) మండిపడ్డారు. ఈ మేరకు యూట్యూబ్‌ ఛానెళ్లపై ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం వివాహ వార్షికోత్సంలో తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోను ఇప్పుడు మరోసారి పోస్టు చేసి ఫేక్‌ థంబ్‌నైల్స్‌ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కోరారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై తప్పుడు వార్తలు రాసి డబ్బులు సంపాదించుకుంటున్నాయని ఆరోపించారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజు రోజుకూ అధికమవుతున్నాయన్నారు. ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని ఏసీపీని కోరానని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా తాను వెనుకాడనని హేమ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని