Hema: ‘భక్తితో వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు’ : హేమ

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నటి హేమ ఓ విలేకరి పట్ల అసహనానికి గురయ్యారు.

Updated : 04 Oct 2022 13:14 IST

విజయవాడ: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నటి హేమ (Hema) ఓ విలేకరి పట్ల అసహనానికి గురయ్యారు. తాను భక్తితో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చానని.. కాంట్రవర్సీల కోసం రాలేదంటూ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హేమ మాట్లాడారు..‘‘దుర్గమ్మ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని వార్తల్లో చూశా. ఈ ఏడాది అమ్మవారిని దర్శనం చేసుకోలేనేమోనని కంగారుపడ్డా. కానీ, ఆ దేవి దయ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం మీడియా పాయింట్ నుంచి ఆమె బయలుదేరుతుండగా ఓ విలేకరి.. ‘‘మేడమ్‌ మీరు ఎంతమంది వచ్చారు? ఏ టిక్కెట్‌ కొనుగోలు చేశారు?’’ అని ప్రశ్నించాడు. విలేకరి ప్రశ్నతో హేమ ఒకింత అసహనానికి గురయ్యారు. ‘‘మేము ఇద్దరం వచ్చాం. ప్రొటోకాల్ ప్రకారమే టిక్కెట్‌ కొనుగోలు చేసి... అమ్మవారి దర్శనం చేసుకున్నాం. నేను గుడిలో రూ.10 వేలు కానుకగా ఇచ్చాను. రూ.20 వేలు పెట్టి చీర కొని అమ్మవారికి సమర్పించాను. ఎందుకు వివాదాన్ని సృష్టిస్తున్నారు ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని