Hema: జైలు నుంచి బయటకు.. మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు: హేమ

రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమకు బెయిల్‌ లభించడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.

Published : 14 Jun 2024 16:49 IST

బెంళూరు: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీనటి హేమ (Hema) జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేశారు. ఈ  క్రమంలో శుక్రవారం హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈసందర్భంగా సెక్యురిటీ పోస్ట్‌ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను కన్నడలో ప్రశ్నించగా, ‘బర్త్‌డే పార్టీ’ అంటూ సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వెళ్తే, వేరేరకంగా ఉంటుందంటూ హేమ పక్కన ఉన్న వ్యక్తి ఆమెకు సూచించారు. అయితే, ‘వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది’ అనుకుంటూ హేమ అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని